‘గౌరీ లంకేశ్’ పేరుకు బదులు ‘గౌరీ శంకర్’ అని ట్వీట్ చేసి మహేష్ కత్తికి అడ్డంగా దొరికిన పవన్ కళ్యాణ్...!

SMTV Desk 2017-09-08 15:52:22  mahesh katthi, pawan kalyan, ap politics,

హైదరాబాద్ సెప్టెంబర్ 6: ఇటీవల మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యకు గురైన విషయం అందరికీ విదితమే. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈమె మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ.. ఆమె పేరును గౌరీ లంకేష్ కు బదులు గౌరీ శంకర్ అని టైప్ చేశాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన మహేష్ కత్తి ఆమె పేరు గౌరీ శంకర్ కాదు..గౌరీ లంకేశ్ అని రీ ట్వీట్ చేశాడు. అయితే గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ కు మహేష్ కత్తికి మధ్య వివిధ అంశాలపై మాటల యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పవన్ అభిమానులు మహేష్ కత్తిని బెదిరిస్తున్నారని, వారి నుండి తనకు ప్రాణ హాని ఉందనే సందిగ్ధాన్ని సైతం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మొన్న పార్టీ డిజిటల్ విభాగంలో పెట్టిన మీటింగ్ లో మహేష్ కత్తి గురించి ప్రశ్న వస్తే అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ చెప్పిన సందర్భంలో.. మహేష్ కత్తి పవన్ కళ్యాణ్ చర్యలపై, కదలికలపై, ట్వీట్ల పై ఓ కన్నేసి ఉంచినట్లు మహేష్ కత్తి చేసిన ట్వీట్ ద్వారా స్పష్టం అవుతుంది.