బిసినెస్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్...!

SMTV Desk 2017-09-07 12:51:37  prabhas, 40cr budget, prabhas next business, baahubali

నెల్లూరు సెప్టెంబర్ 7 : ప్రభాస్ ఇపుడు సాహో చిత్రంకోసం బాగా కష్టపడుతున్నాడు. ఏదైనా సరే బాహుబలి అంత భారీగానే చేయాలని అనుకున్నారేమో, అందుకే ఇపుడు ప్రభాస్ నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారి పక్కన ఏడున్నర ఎకరాల స్థలంలో మూడు థియేటర్ల మల్టీ కాంప్లెక్స్, ఆ ఆవరణలోనే రెస్టారెంట్లు, చిన్న పిల్లలకు వివిధ రకాల ఆటల విభాగాలు ఇందులో ఏర్పాటు చేస్తున్నాడు. ఈ మూడు థియేటర్లలో ఒక దానిలో దేశంలో మరెక్కడా లేని విధంగా తొలిసారి 106 అడుగుల త్రీడీ ఎఫెక్ట్స్ తో కూడిన భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేస్తున్నాడు. ఇందులో 670 సీట్లు ఉంటాయి. మిగిలిన థియేటర్లలో 170 చొప్పున సీట్లు ఉంటాయి. ఈ నిర్మాణాన్ని రూ. 40 కోట్లతో నిర్మిస్తున్నాడు. 2018 తొలి త్రైమాసికంలో వీటిని ప్రారంభించేందుకు ప్రభాస్ సన్నాహకాలు చేసుకుంటున్నాడు. దీని తరువాత ఓ భారీ కళ్యాణ మండపం నిర్మిస్తున్నారని సమాచారం