హైదరాబాద్ సెప్టెంబర్ 6 : అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. ఈ సినిమాలో ఆక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య పోరాట సన్నివేశాలు చిత్రానికి హై లెట్ గా నిలువబోతున్నాయని సమాచారం. అల్లు అర్జున్ వర్సెస్ అర్జున్... ప్రస్తుతం హైదరాబాద్‌లో వీరిపై ఓ ఫైట్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. . ఈ షెడ్యూల్ వారం రోజుల పాటు జరుగుతుందట. వారం తర్వాత ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో వార్ సీన్స్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో తమిళ నటుడు శరత్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. . సంగీతాన్ని విశాల శేఖర్ సమకూరుస్తున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 27న ఈ చిత్రం విడుదల కానుంది.