హైదరాబాద్ సెప్టెంబర్ 5 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా తను నటిస్తున్న 25వ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ విడుదల అవ్వడం ఫ్యాన్స్ లో ఉత్తేజాన్ని కలిగించగా, కొందరిలో మాత్రం అనుమానాన్ని కలిగించింది. అయితే ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రుఖ్’ మూవీ పోస్టర్‌ని పోలి ఉందని కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించడం మొదలు పెట్టారు. అంతేకాదు రుఖ్ మూవీ కథని బేస్ చేసుకొనే పీస్‌పీకే 25 తెరకెక్కిస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారు. మరి దీనిపై యూనిట్ నుండి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. ఈ మూవీకి అజ్ఞతవాసి అనే టైటిల్‌ని పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళంలో పాపులర్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది.