స్టాట్యుటరీ వార్నింగ్ వీడియో తీసేయండి : స్పైడర్ టీం

SMTV Desk 2017-09-04 13:07:23  mahesh babu, spyder, harish jai raj,rakul ,murugadas, staturary warning

హైదరాబాద్ సెప్టెంబర్ 4 : మా సినిమాకు స్టాట్యుటరీ వార్నింగ్ వీడియో లేకుండ ప్లే చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరింది స్పైడర్ టీం. ఈ మధ్య కాలంలో సినిమాల్లో స్మోకింగ్.. డ్రింకింగ్‌కి సంబంధించిన సీన్స్ ఉండటం తప్పనిసరి అయిపోయింది. కానీ స్పైడర్ సినిమాలో మాత్రం దీనికి సంబంధించిన సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదట. ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా గ్రీన్ టీ తాగుతూ కనిపిస్తాడే కానీ డ్రింక్ కానీ.. స్మోక్ చేస్తూ కానీ కనిపించడట. చివరికి బ్యాక్ గ్రౌండ్‌లో కూడా ఈ సీన్స్ కనిపించవట. దీంతో చిత్ర బృందం సెన్సార్ బోర్డు ముందు ఈ విన్నపాన్ని ఉంచింది. దీనికి సెన్సార్ బోర్డ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రిన్స్ మహేష్ బాబు.. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. ఇంత భారీ బడ్జెట్ మూవీలో డ్రింకింగ్.. స్మోకింగ్ సీన్స్ లేకపోవడం నిజంగా ఓ విశేషమే. రెండున్నర నిముషాల పాటు సాగే స్టాట్యుటరీ వార్నింగ్ వీడియో ప్రేక్షకులను ఇబ్బందిపెడుతుందనే విషయం అందరికీ తెలిసిందే!.