మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ రాష్ట్రానికి చోటు ఎందుకు దక్కలేదో తెలుసా..?

SMTV Desk 2017-09-04 10:34:23  trs,bjp,ministers,modi, kcr,national politics,telangana politics

ఢిల్లీ సెప్టెంబర్ 4: కేంద్ర మంత్రి వర్గ విస్తరణ పూర్తి అయింది. కొత్త మంత్రులంతా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే మంత్రి వర్గ విస్తరణ కొలిక్కి వచ్చిన సమయంలో తెలంగాణ నుండి కూడా కొందరు బీజేపీ నాయకుల పేర్లు వినబడ్డ సంగతి అందరికీ తెలిసిందే. కిషన్ రెడ్డి, మురళీధర్ రావు ఇలా కొంత మంది పేర్లు మీడియా లో హల్ చల్ చేశాయి. కానీ చివరికి వీరిలో కనీసం ఒక్కరికైనా మంత్రి పదవి దక్కలేదు. మోడీ పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించారు. అయితే ఇక్కడ మోడీ తెలంగాణ బీజేపీ నాయకులకు మంత్రి వర్గ విస్తరణలో చోటు ఎందుకు కల్పించలేదనే ప్రశ్న తలెత్తక మానదు. ఈ ప్రశ్నకు సమాధానంగా రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ వ్యూహానికి ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినందున తెలంగాణ ప్రజలు గులాబీ దళానికే పట్టం కట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వెచ్చే ఎన్నికల్లో కూడా గులాబీ దళానికే ప్రజలు పట్టం కట్టనున్నారని గ్రహించిన మోడీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులకు పదవులు కట్టబెడితే ఆయా నాయకులు చేసిన అభివృద్ధిని టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంటుందనే ఉద్దేశంతోనే మోడీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.