ఉపరాష్ట్రపతి ఘన స్వాగతం పలికిన గవర్నర్ నరసింహన్

SMTV Desk 2017-09-03 16:49:38  hyderabad, vice president of india venkaih naidu,

హైదరాబాద్, సెప్టెంబర్ 3: భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ కు ఉపరాష్ట్రపతిని గవర్నర్ నరసింహన్, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మండలి చైర్మన్ స్వామి గౌడ్, సీఎస్ ఎస్పీ సింగ్ లు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా శామీర్ పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయ సంస్థ 78వ సమావేశాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొననున్నారు.