2019 తెలంగాణ ఎన్నికల్లో గద్దెక్కేది ఏ పార్టీ..?

SMTV Desk 2017-09-01 14:40:12  trs, tdp, bjp, congress, 2019 elections, kcr

హైదరాబాద్ సెప్టెంబర్ 1: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీల చూపంతా 2019 ఎన్నికలపైనే ఉంది. ఇందులో అధికారాన్ని ఎలా కైవసం చేసుకోవాలని కొన్ని పార్టీలు వ్యూహ రచన చేస్తుంటే.. మరి కొన్ని పార్టీలు అధికార పార్టీ నాయకుల వ్యూహాలకు చెక్ పెట్టి సాధ్యమైనన్ని అసెంబ్లీ స్థానాలను ఎలా గెల్చుకోవాలనే పనిలో నిమగ్నం అయినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు . అయితే ఇప్పటికే అధికారంలో ఉన్న గులాబీ దళం మళ్ళీ అధికారాన్ని చేపట్టాలని తహతహ లాడుతున్న సమయంలో ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పార్టీని పటిష్ట పరుచుకొని గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని ప్రణాళిక రచిస్తుంది. అయితే ఈ ప్రాయంలో 2019 ఎన్నికల్లో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందనే ప్రశ్న ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం మళ్ళీ గులాబీ పార్టీ యే అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది. దీనికి కారణాలు సైతం లేకపోలేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ చేపట్టాల్సిన పనులన్నీ దాదాపుగా సగంలోనే ఉన్నాయి. అయితే పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోనున్న కేసీఆర్ చేసే పనిని ఎన్నికల సమయం వరకు సక్రమంగా చేసి మిగతా పనిని చేయాలంటే మాత్రం మళ్ళీ అధికారాన్ని కల్పించాల్సిందిగా తెలంగాణ ప్రజలను కోరే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం నల్లేరు పై నడకే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు..!