బిస్కెట్ ప్యాకెట్ లో షాకింగ్ గిఫ్ట్...

SMTV Desk 2019-10-23 16:09:28  

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. లక్ అంటే లాటరీలో డబ్బులు రావడమే మనలో చాలామందికి తెలుసు. కానీ ఆకలేసి చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొంటె ఓ వ్యక్తి కి ఏకంగా కార్ గిఫ్ట్ గా వచ్చింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 సందర్భంగా పార్లేజీ కావో, క్రోర్స్ ఇనాం పావో పేరిట జూన్ నెలలో పార్లేజీ సంస్థ కొన్ని బిస్కెట్ ప్యాకెట్లలో వోచర్లను ఉంచింది. కాగా హైదరాబాద్ కు చెందిన జంగపల్లి నాగరాజుకు వోచర్ లో రెనాల్డ్ ట్రైబర్ కారు బిస్కెట్ ప్యాకెట్‌లో వచ్చింది. ఈ సందర్బంగా మంగళవారం బేగంపేటలోని రెనాల్డ్ షోరూంలో పార్లేజీ ప్రతినిధులు కారును అందించారు.

బహుమతిని అందుకున్న నాగరాజు మాట్లాడుతూ తన జీవితంలో ఇది అత్యంత గొప్ప రోజు అని చెప్పాడు. తాను కొన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్లో ఇంత పెద్ద బహుమతి ఉంటుందని ఊహించలేదన్నారు. పార్లేజీ యాజమాన్యానికి నాగరాజు కృతఙ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న కొందరు లక్ అంటే నీదే గురు అంటూ పొగుడుతున్నారు.