మేం రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమకారులం!!

SMTV Desk 2019-10-17 15:05:22  

తాము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమకారులమని, ఏది ఎప్పుడు ఎలా చేయాలో తమకు తెలుసునని రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. బుధవారమిక్కడ ‘ట్రాన్స్‌ ఫార్మింగ్‌ స్టేట్‌ ఎఫెక్టివ్‌నెస్‌ ఇన్‌ తెలంగాణ’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గుణాత్మక మార్పులకు నాంది పలుకుతోందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. అర్థగణాంక, ప్రణాళిక శాఖలు పక్కా వివరాలు సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సలహాదారు మురళీధరన్‌ కార్తికేయన్‌, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జి.ఆర్‌.రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, అర్థ గణాంక శాఖ డైరెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళిక, అభివృద్ధిలో సమగ్ర కార్యాచరణ రూపకల్పనకుగాను ‘సెంటర్‌ ఫర్‌ ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టేట్స్‌ (సీఈజీఐఎ్‌స)’తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది.