ఇది మా సెల్ఫీ : షారూక్ సతీమణి

SMTV Desk 2017-08-29 18:26:59  SHARUKH KHAN, KAJOL, GOWRI KHAN, SELFEE

ముంబై, ఆగస్ట్ 29 : బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్, నటి కాజోల్ జోడీ అనగానే మనకు మొదట గుర్తొచ్చే సినిమా "దిల్ వాలే దుల్హానియా లేజాయె౦గే". ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నా అనుకుంటున్నారా..? అసలు విషయ౦ ఏంటంటే.. షారూక్ ఖాన్ భార్య, హీరోయిన్ కాజోల్ కలిసి దిగిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ముంబైలో గౌరీఖాన్ డిజైన్ చేసిన షాపింగ్ మాల్ లో వీరు కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఓ ఫోటోను గౌరీఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. "ఇది మా సెల్ఫీ.. ఈ సారీ, అబ్ రామ్ ను కూడా స్టోర్ కు తీసుకువస్తా" అంటూ పేర్కొన్నారు.