"అర్జున్ రెడ్డి" ఫస్ట్ డే కలెక్షన్స్

SMTV Desk 2017-08-26 16:30:43  VIJAY DEVARAKONDAA, DIRECTER SANDEEP REDDY, FIRST DAY COLLECTIONS

హైదరాబాద్, ఆగస్ట్ 26 : విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం "అర్జున్ రెడ్డి". ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సాధించింది. కాగా ఈ చిత్ర౦ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.. నైజామ్ లో 1.22 కోట్లు, సీడెడ్ లో 33 లక్షలు, ఉత్తరాంధ్రలో 21 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 12 లక్షలు, వెస్ట్ గోదావరిలో 9 లక్షలు, కృష్ణాలో 25 లక్షలు, గుంటూరులో 20 లక్షలు, నెల్లూరులో 5 లక్షలను రాబట్టింది. ఇలా ఈ సినిమా తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 47 లక్షలను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కెరియర్‌లో మరో హిట్ నమోదైనట్టేననే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నూతన కథానాయిక షాలిని పాండే హీరోయిన్ గా నటించగా, రాధన్ సంగీతాన్ని అందించారు.