వేసవి రద్దీతో ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లు

SMTV Desk 2017-06-03 14:04:11  summer, spacial trains,

హైదరాబాద్, జూన్ 3 : వేసవి కాలం కావడంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 16 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆవ్వో ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. కాచిగూడ-కృష్ణరాజపురం (0760 3/07604) రైలు ఈ నెల 4,11,18,25 తేదిల్లో సాయంత్రం 6 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కృష్ణరాజపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 5,12,19, 26 తేదిల్లో రాత్రి 10.30కు కృష్ణరాజపురం నుంచి బయలుదేరి మరుసటి రోజు 11.15కు కాచిగూడ చేరుకుంటుంది. నాందేడ్-అజ్ని (07629/07630) రైలు ఈ నెల 5,12,19,26 ల్లో రాత్రి 8.30కు నాందేడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.25కు అజ్ని చేరుకుంటుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో 6,13, 20, 27 తేదిల్లో రాత్రి 10.20కి అజ్ని నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10కి నాందేడ్ చేరుకుంటుంది.