"రాక్‌ స్టార్‌ బాబా" దోషి : సీబీఐ కోర్టు సంచలన తీర్పు

SMTV Desk 2017-08-25 17:07:35  GURMITH SINGH BABA, CBI COURT, HARYAANA POLICE, CENTRAL JAIL

చండీగఢ్, ఆగస్ట్ 25 : "రాక్‌ స్టార్‌ బాబా" గా గుర్తింపు పొందిన బాబా గుర్మీత్‌సింగ్‌ పై నమోదైన అత్యాచార కేసులో ఈరోజు సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బాబా దోషేన‌౦టూ సీబీఐ కోర్టు నిర్ధారించింది. బాబాకు కోర్టు ప్రాంగణంలోనే వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనను హర్యానా పోలీసులు కస్టడీలోకి తీసుకొని జైలుకి తరలిస్తున్నారు. బాబా భ‌క్తులు ఈ తీర్పుని జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీంతో హర్యానా పంచకుల సీబీఐ కోర్టుకి భారీ ఎత్తున ఆయన అభిమానులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛ‌నీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కాగా ప్రస్తుతం బాబాను అంబాలా సెంట్రల్ జైలుకి తరలించనున్నట్లు సమాచారం. ఈ నెల 28న ఆయనకు శిక్ష ఖరారు చేయనున్నారు. కనీసం ఏడు సంవత్సరాల పాటు శిక్ష పడుతుందని న్యాయవాదులు భావిస్తున్నారు.