వినాయక చవితి సందర్బంగా విడుదలవనున్న "లవ" టీజర్

SMTV Desk 2017-08-24 13:56:09  Jai lava kusa, Teaser, NTR , Young Tiger, NTR Arts, Release date

హైదరాబాద్, ఆగస్ట్ 24: హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం "జై లవ కుశ ". యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో విభిన్న పాత్రలలో అలరించబోతున్నాడు. ఇప్పటికే "జై" పాత్రకు సంబంధించిన టీజర్‌తో మురిపించిన ఎన్టీఆర్ తన రెండో పాత్ర "లవ" టీజర్‌ను వినాయక చవితి సందర్బంగా 25వ తేదీ సాయంత్రం 5:40కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు బాబి, నిర్మాత రామ్‌లు భావిస్తున్నట్లు సినీవర్గాల సమాచారం. ఈ సినిమాకు రాకింగ్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతంను అందించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నివేదథామస్, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా అభిమానుల్ని ఈ టీజర్ ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.