నేటి నుండి నోకియా 6... అమెజాన్ లో ఆఫర్స్

SMTV Desk 2017-08-23 12:21:16  Nokia 6, Nokia 5, Nokia 3, HMD, Smartphones, Amazon, Nokia 6 online buy

ముంబై, ఆగస్ట్ 23: మొబైల్ ఫోన్స్ దిగ్గజ సంస్థ నోకియా మరో శుభవార్తను తన వినియోగదారులకు తెలియ పరిచింది. ఎంతో కాలంగా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నోకియా 6 ఆండ్రాయిడ్ ఫోన్‌ను వినియోగదారులకు నేటి నుండి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ-కామర్స్ అమెజాన్ లో ఈ మధ్యాహ్నం 12 గంటల నుండి లభించనుంది. కాగా, నోకియా 3, నోకియా 5లు ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా లభిస్తున్నాయి. నోకియా 6 విశేషతలకు వచ్చేసరికి... ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయల్ సిమ్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం, 16/8 ఎంపీ కెమెరాలతో పాటు 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 14,999 కాగా, ప్రైమ్ మెంబర్లకు వివిధ ఆఫర్లను ప్రకటించింది అమెజాన్ సంస్థ.