పిల్లలు పుట్టడం లేదని ఏడు నెలల పాపను కిడ్నాప్ చేసి బలిచ్చారు

SMTV Desk 2017-06-03 11:24:08  crime,kidnapping,

జార్ఖండ్,జూన్ 3 : పిల్లలు పుటడం లేదని ఒక ఏడూ నెలల పాపను కిడ్నాప్ చేసి బలిచ్చిన సంఘటన జంషెడ్ పూర్ లో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్ లోని సెరైకేలా- ఖర్వ్సాన్ జిల్లా తిరుల్ది గ్రామానికి చెందిన బదోయి కాలింది అనే వ్యక్తి పాములు ఆడిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి వివాహమై సంతానం కలుగక పోవడంతో ఎలాగైనా పిల్లలను కనాలని ఆఊరిలో బాగాపేరున్న మంత్ర గాడు కార్ము దగ్గరకు వెళ్ళాడు. నాకు పిల్లలు కలుగాలంటే ఎం చేయాలనీ కార్ము ను అడిగితె నర బలి ఇవ్వాలని చెప్పాడు. నర బలి ఎలా చెయ్యాలో నాకు తెలియదు దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పాడు. దీంతో మే 26 న అర్ధరాత్రి అంత నిద్ర పోయిన సమయంలో బదోయి తో కలిసి కార్ము తన నివాస సమీపంలో ఉంటున్న సుభాష్ గోపి కి ఏడూ నెలల పాప ఉంది. అతని కుమార్తె ను ఎత్తుకొచ్చి తరువాత ఆ గ్రామానికి సమీపంలోని నది తీరంలో పాపను బాలిచ్చారు. సుబాస్ గోపి కూతురు కనిపించక పోవడం తో వాళ్ళు పోలిసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వారు దర్యాప్తు ప్రారంభించారు. నరబలి జరిగిన తరువాత కార్ము కనిపించక పోవడం తో అనుమానం వచ్చిన పోలీసులు అతనిని పట్టుకుని విచారించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను అరెస్టు చేసి వారు ఉపయోగించిన ఆయుధం స్వాదినం చేసుకున్నారు. పోలీసులు బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు.