కెటిఆర్‌ను కలిసిన వరంగల్ మేయర్

SMTV Desk 2019-04-30 16:34:52  greater warangal Meyer, elections, gunda prakash rao, trs, ktr

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌తో నూతనంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికైన గుండా ప్రకాష్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్ గా ఎంపికైన ప్రకాష్ ని కే.టి.ఆర్ అభినందించారు. మేయర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసిన కెటిఆర్, స్థానిక నేతలతో పాటు పార్టీ ఇంఛార్జ్‌గా వ్యవహరించిన టిస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లుకు ప్రకాశ్ రావు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్‌ నగర పాలక సంస్థ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని ప్రకాశ్ రావుకు కెటిఆర్ సూచించారు. సహచర కార్పొరేటర్లను కలుపుకుని ముందుకు సాగుతూ వరంగల్ అభివృద్ధికి పాటుపడాలని ఆయన మేయర్ గుండా ప్రకాష్ రావుకు సూచించారు. కెటిఆర్‌ను కలిసిన వారిలో మేయర్ గుండా ప్రకాష్‌రావుతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపి బండ ప్రకాష్‌, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌ భాస్కర్‌, రాజయ్య, పసునూరి దయాకర్‌ ఉన్నారు.