మనసారా నవ్వడం ఎంత మేలో మీకు తెలుసా?

SMTV Desk 2017-06-02 19:10:35  health tips about tensions,

మనిషిలో ఒత్తిడి వల్ల ఆందోళన, కంగారు, తల నొప్పి వంటివే కాకుండా.. మానసిక , జీర్ణ సంబంధమైన సమస్యలు ఎదురుకుంటున్నారు. బరువు పెరుగుదల ఉండకపోగా, ఇంకా నిర్లక్యం చేస్తే గుండె జబ్బులు తప్పకపోవచ్చును. అందుకే ఒత్తిడిని మన అందుపులో ఉండేలా చూసుకోవాలి. మొదట ఒత్తిడికి కారణమేమిటో ఆ అంశాలను ఓ చోట క్రమపద్ధతిలో రాసుకొని వాటిని రోజు వారిగా తగ్గితుకుంటూ వెళ్లాలి. ఏ ఒత్తిడినైన గెలువాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. మానసికంగా శారీరకంగా ఉండేందుకు మీకు ఇష్టమైన వ్యాయామాని ఎంచుకొని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ధ్యానం ఎలాంటి ఒత్తిడినైన ఉల్లాస పరుస్తుంది. ఒక పదినిమిషాల పాటు ధ్యానం చేస్తూ అలా రోజు సమయాన్ని కొంచెంగా పెంచుకుంటూ ఉండండి. మీరు తీసుకునే ఆహరంపై కూడా ఒత్తిడిపై ప్రభావం చూపుతుంది. అందుకే సమతలమైన పౌష్టికాహారం ఆహరం తీసుకోవడం ద్వారా మిమ్మల్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుతుంది. దాంతో మీకు ఎదురయ్యే ఏ రకం ఒత్తిడినైన సమర్ధంగా ఎదుర్కోగలరు. ఒత్తిడి అధికంగా అనిపిస్తే వెంటనే కలతలు లేని నిద్ర మీ శరీరానికి, మెదడుకు చాలా అవసరం, ఆరోగ్యంగా ఉండడానికి ఒత్తిడి లేకుండా హాయిగా నిద్రపోవడం ముందుగా చూసుకోవాలి. దీంతో పాటు ముఖ్యంగా మనసారా నవ్వడం వల్ల సగం ఒత్తిళ్లు వాటికవే తగినట్లు అనిపిస్తుంది. కాబట్టి అన్ని వేళలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలానే సరదాగా మాట్లడేవారితో గడిపిన కూడా ప్రయోజనం ఉంటుంది. తోటపని చేయడం లేదా సంగీతం వినడం, మనసుకు నచ్చిన పనులు, మొక్కల మధ్య గడపడం వలన కూడా ఒత్తిడి సులువుగా తగ్గుతుందని నిపుణులు చెప్పుతున్నారు.