గనుల ఆదాయంలో టాప్ 1లో తెలంగాణ

SMTV Desk 2019-04-29 19:58:44  telangana state government, sccl

హైదరాబాద్: గనుల ఆదాయం వృద్ధిరేటులో ఎన్నడూ లేని విధంగా అధిక ఆదాయాన్ని పొంది దేశంలోని టాప్‌ టెన్ రాష్ర్టాల్లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. దేశంలో గనులు పుష్కలంగా ఉన్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు కలుపుకొని మొత్తం పది రాష్ట్రాల గనులశాఖ ఆదాయాలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది.2016-17 ఆర్థిక సంవత్సరంలో 103%, 2017-18లో 108% ఆదాయ వృద్ధిరేటు సాధించిన తెలంగాణ.. 2018-19 ఆర్థికసంవత్సరంలో ఏకంగా 119% వృద్ధిరేటు సాధించింది. అయితే.. ఒడిశా 156% ఆదాయ వృద్ధిరేటు సాధించినా.. గోవాలో ఐరన్‌ఓర్ తవ్వకాలను సుప్రీంకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేయడంతో ఆ రాష్ట్రంలో ఐరన్‌ఓర్‌కు భారీగా డిమాండ్ పెరిగి, ఆదాయాన్ని పెంచింది. వాస్తవానికి గతంలో ఏనాడూ ఒడిశా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. తెలంగాణతో పోల్చితే మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ లాంటి పెద్ద రాష్ట్రాలతోపాటు.. ఖనిజ సంపద పెద్ద ఎత్తున ఉన్న ఛత్తీస్‌ గఢ్, జార్ఖండ్ వంటి రాష్ర్టాల్లో భారీ ఎత్తున ఆదాయం వృద్ధి నమోదు కాకపోవడం గమనార్హం.