ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా!

SMTV Desk 2019-04-29 18:28:23  telangana inter board of education, inter advanced supplementary exams 2019

హైదరాబాద్: మే 16 నుంచి జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియేట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు అదే నెల 25 నుంచి జూన్ 4 వాయిదా వేసినట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అలాగే జూన్ 7 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు,మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. జూన్ 3వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నైతికత, మానవ విలువల పరీక్ష, జూన్ 4వ తేదీన పర్యావరణ విద్యపై పరీక్షలు ఉంటాయి. ఇంటర్ ఒకేషనల్ కోర్సులకు ఇదే పరీక్షల షెడ్యూల్ ఉంటుందని, ఆ పరీక్షలకు ప్రత్యేకంగా షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు అశోక్ పేర్కొన్నారు. గడువు శనివారంతో ముగిసింది. ఫెయిలైన రీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 15 రోజులు పట్టే అవకాశమున్న నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలకు వాయిదా వేశారు.

తేదీ ప్రథమ సంవత్సరం తేదీ ద్వితీయ సంవత్సరం:
25/05/2019 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 25/05/2019 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2,
26/05/2019 ఇంగ్లీష్ పేపర్-1 26/05/2019 ఇంగ్లీష్ పేపర్-2,
27/05/2019 మ్యాథమెటిక్స్ పేపర్-1ఎ 27/05/2019 మ్యాథమెటిక్స్ పేపర్-2ఎ,
బోటనీ పేపర్-1 బోటనీ పేపర్-2,
సివిక్స్ పేపర్-1 సివిక్స్ పేపర్-2,
సైకాలజి పేపర్-1 సైకాలజి పేపర్-2,
28/05/2019 మ్యాథమెటిక్స్ పేపర్-1బి 28/05/2019 మ్యాథమెటిక్స్ పేపర్-2బి,
జువాలజి పేపర్-1 జువాలజి పేపర్-2,
హిస్టరీ పేపర్-1 హిస్టరీ పేపర్-2,
29/05/2019 ఫిజిక్స్ పేపర్-1 29/05/2019 ఫిజిక్స్ పేపర్-2,
ఎకనామిక్స్ పేపర్-1 ఎకనామిక్స్ పేపర్-2,
క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-1 క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-2,
30/05/2019 కెమిస్ట్రీ పేపర్ -1 30/05/2019 కెమిస్ట్రీ పేపర్ -2,
కామర్స్ పేపర్-1 కామర్స్ పేపర్-2,
సోషియాలజి పేపర్-1 సోషియాలజి పేపర్-2,
ఫైన్ ఆర్ట్, మ్యూజిక్ పేపర్-1 ఫైన్ ఆర్ట్, మ్యూజిక్ పేపర్-2,
31/05/2019 జియాలజి పేపర్-1 31/05/2019 జియాలజి పేపర్-2,
హోమ్ సైన్స్ పేపర్-1 హోమ్ సైన్స్ పేపర్-2,
లాజిక్ పేపర్-1 లాజిక్ పేపర్-2,
బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-1(బైపిసి విద్యార్థులకు) బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-1(బైపిసి విద్యార్థులకు),
01/06/2019 మాడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1 01/06/2019 మాడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2,
జియోగ్రఫీ పేపర్-1 జియోగ్రఫీ పేపర్-2,