పాలిసెట్ రిజల్ట్స్ విడుదల

SMTV Desk 2019-04-26 15:58:01  ts polycet 2019 results, telangana polytechnic results 2019

హైదరాబాద్: శుక్రవారం రాష్ట్ర పాలిటెక్నిక్ 2019 ప్రవేశ పరీక్ష ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ విడుదల చేశారు. ఈ నెల 16న పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1,03,591 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు హాజరు కాగా.. అందులో 92.53 శాతం మంది అంటే 95,850 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా ఉండగా ఈ ఫలితాలను హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవనంలో ఉన్న ఎస్‌బిటిఇటి ఆఫీసులో విడుదల చేశారు. పాలిసెట్ 2019లో సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు 120 మార్కులకు 120 సాధించి మొదటి స్థానం పొందారు. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు 120 మార్కులకు 119 మార్కులు సాధించి ఏడో, పదో స్థానంలో నిలిచారు.