మళ్ళీ ప్రియుడితో జోడీ కట్టిన హీరోయిన్

SMTV Desk 2017-08-21 11:04:46  PRODUCER RITHESH SIDWANI, BIRTHDAY PARTY CELEBRATIONS, RANVEERSINGH, DEEPIKA PADUKONE

ముంబై, ఆగస్ట్ 21 : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత రితేశ్ సిద్వానీ పుట్టిన రోజు వేడుకలకు ముంబై వేదికగా మారింది. వీకెండ్ కావడంతో పలువురు స్టార్స్ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఈ మధ్య హాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసిన ప్రియాంక చోప్రాతో పాటు, మలైకా అరోరా, కిమ్ శర్మ, కరణ్ జోహార్, సోహైల్ ఖాన్, ఫర్హాన్ అక్తార్ తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ ప్రేమ జంట రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనే ఒకే కారులో రావడం ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి ప్రేమకు బ్రేకులు పడ్డాయని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరు కలిసి "పద్మావతి" చిత్రంతో జత కట్టడంతో మళ్ళీ కలిసిపోయారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.