ఎసిబికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన జిహెచ్‌ఎంసి అధికారి

SMTV Desk 2019-04-18 18:38:16  ghmc, acb

హైదరాబాద్‌: హైదరాబాద్ లో ఓ జిహెచ్‌ఎంసి అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఎసిబికి పట్టుబడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దక్షిణ మండల జిహెచ్‌ఎంసి కార్యాలయంలో వల పన్నిన అవినీతి నిరోధక శాఖ అధికారులు రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసిబి అధికారులు సూచించారు.