తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈ రోజే ..

SMTV Desk 2019-04-18 11:31:10  Telangana, Inter results,

తెలంగాణ ఇంటర్ ఫలితాల అంశమై గత కొన్ని రోజులుగా సస్పెన్సు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు తెలంగాణ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ ఫలితాలు గురువారం సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నాయి.

విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి వీటిని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. tsbie services అనే మొబైల్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని ఫలితాలు తెలుసుకోవచ్చని చెప్పారు. లేదా ఫలితాలను tsbie.cgg.gov.in, bie.telangana.gov.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.