మందకృష్ణమాదిగ హౌస్ అరెస్ట్

SMTV Desk 2019-04-17 18:32:26  mandakrishna madiga house arrest, dr br amedkar, telangana police, cm kcr

హైదరాబాద్: రాజ్యాంగ రచయిత అంబేద్కర్ ను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిన్న చూపు చూస్తున్నారని ఆరోపిస్తూ దానికి నిరసనగా ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణమాదిగ ఈనెల 22 రాష్ట్ర వ్యాప్త నిరశనలకు పిలుపునిచ్చారు. అయితే ఈ క్రమంలో మందక్రిష్ణ పై తెలంగాణ సర్కార్ చర్యలకు ఉపక్రమించి ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అంబర్‌పేటలోని డీడీ కాలనీలోని తన ఇంటికి చేరుకున్న పోలీసులు మందకృష్ణను ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిర్భందించారు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కృష్ణమాదిగ అరెస్ట్‌ను ఎమ్మార్పీఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందోని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నియంతాల వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంత్యుత్సవాల్లో సీఎం కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదని మందకృష్ణ మాదిగ ప్రశ్నించిన విషయం తెలిసిందే. దళితుడైనందునే అంబేడ్కర్‌ను సీఎం అవమానించారన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 16న అన్ని జిల్లాల్లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.