అంబేద్కర్ చూపిన మార్గంలోనే తెలంగాణ

SMTV Desk 2019-04-15 10:55:43  ambedkar, ktr, kcr

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నేడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాతగా జాతికి దిశానిర్ధేశం చేసిన అంబేద్కర్ ఇప్పటికీ ఎప్పటికీ జాతికి మార్గదర్శి అని సిఎం కెసిఆర్ ప్రకటనలో పేర్కొన్నారు. బలహీన వర్గాల సంక్షేమం,అభివృద్ధి కోసం ఆయన చూపిన బాటలో తెలంగాణ రాష్ట్రం ప్రయత్నిస్తుండటం సంతోషకరమన్నారు. అలాగే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అంబేడ్కర్ గారికి నివాళులర్పించారు అంబేద్కర్ చూపిన మార్గంలోనే కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారని గుర్తు చేశారు. అంబేద్కర్ తత్వం నేటి భారత దేశానికి చాలా అవసరం ఉందని కెటిఆర్ కొనియాడారు. బలహీనులు, అల్పసంఖ్యాక వర్గాలకు అండగా ఉండటమే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అని పొగిడారు. అంబేద్కర్ కొందరివాడు కాదని, అందరి నాయకుడని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలతో ఆపన్నులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. శనివారం పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.