అంబేడ్కర్ విగ్రహాన్ని ద్వంసం చేసిన జీఎహెచ్ఎంసీ

SMTV Desk 2019-04-14 12:07:45  amdekar statue destroyed by ghmc officers in punjagutta, hyderabad

హైదరాబాద్: హైదరాబాద్ లోని పంజాగుట్ట చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని జీఎహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. ఈ విగ్రహాన్ని దళిత సంఘాలు ఏర్పాటు చేశారు. అయితే జీఎహెచ్ఎంసీ అధికారుల అనుమతి లేకుండా ప్రతిష్టించారంటూ వారు దాన్ని తొలగించారు. అంతటితో ఊరుకోకుండా ముక్కలు చేసి చెత్తకుప్పలో పడేశారు. దీనిపై దళిత సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.అంబేద్కర్‌ విగ్రహ పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడిమల్ల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. తమ అనుమతి లేకుండా దీన్ని ఏర్పాటు చేశారని పోలీసులు అంటున్నారు. అయితే తాము ఈ విగ్రహ ఏర్పాటు కోసం ఈ నెల 4నే అనుమతి కోరామని, అనుమతిలో జాప్యం చేయడంతో ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకోవడం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. తర్వాత జీహెచ్ఎసీం అధికారులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు.