సహోద్యోగిని పై నకిలీ ఫేస్ బుక్ వల

SMTV Desk 2017-06-02 16:40:30  crime cyber,police,social media yral,

హైదరాబాద్, జూన్ 02 : నా ప్రేమను అంగీకరించూ. వెంటనే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడుదాం. అంగీకరించక పోతే నీ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని ఓ యువతి పై కిరాతకంగా ప్రవర్తిస్తూ, రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు పట్టుబడ్డ కేటుగాడు. ప్రేమని అంగీకరించలేదని నకిలీ ఫేస్ బుక్ ఖాతాను తెరిచి ఆ యువతి చిత్రాలను పోస్ట్ చేసిన మునిగాల ప్రవీణ్ ను గురువారం రోజున అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరెడ్ మెట్ కు చెందిన ప్రవీణ్.. ఎల్బీనగర్ లోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తూ ఆ సమయంలోనే సహోద్యోగినితో స్నేహంతో ఉంటూ అనుమతి లేకుండానే ఆమె ఫోటోలు తీశాడు. స్నేహం పేరుతో సేల్పిలు దిగాడు. తరువాత స్నేహం కాదు ప్రేమిస్తున్ననట్ట్టు పెళ్ళిచేసుకోమని వెంటపడ్డాడు. తన ప్రేమని నిరాకరిచింది. అప్పటికి తరుచు ఫోన్ చేసి వేదించాడు. వేధింపులకు గురై ఉద్యోగం మానేసింది. దీంతో ఉద్రిక్తుడైన ప్రవీణ్ భాదితురాలిపై నకిలీ ఫేస్ బుక్ ఖాతాను తెరిచి అందులో ఆమె ఫోటోలను అప్ లోడ్ చేశాడు. వెంటనే ఆ యువతి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న స్నేహితులు భాదితురాలికి చెప్పగా.. రాచకొండ సైబర్ ఠాణా లో ఫిర్యాదు చేసింది. వెంటనే అతడి నుంచి ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు పై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు చేధించిన తీరును సైబర్ క్రైం విభాగాని సీపీ అభినందించారు.