కరీంనగర్ స్పీచ్ : సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ

SMTV Desk 2019-04-10 16:38:12  cm kcr, trs, karimnagar speech, Parliament elections, election commission of india

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ మధ్య కరీంనగర్‌ సభలో చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది. ‘ హందూగాళ్లు, బొందు గాళ్లు దిక్కుమాలిన దరిద్రపుగాళ్లు’ అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారంటూ విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామారాజు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు కేసీఆర్ ప్రసంగానికి సంబంధించిన ఓ కాపీని ఈసీకి అందజేశారు. ఆ కాపీని పరిశీలించిన ఎన్నికల కమిషన్.. కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని, లేఖలో పేర్కొంది. ఇచ్చిన గడువులోపు కేసీఆర్ వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని వివరించింది.