లంగర్‌హౌజ్‌లో రూ.2.40 కోట్లు స్వాధీనం

SMTV Desk 2019-04-09 15:50:47  elections, illegal money, hyderabad langar house

హైదరాబాద్‌: ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో మరో చోట భారీ నగదు బయటపడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నగరంలోని లంగర్‌హౌజ్‌లో ఈరోజు టాస్స్‌ఫోర్స్‌ పోలీసలు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నగదును తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 11వ తేదీన జరగనున్నాయి. ఫలితాలు మే 23న వెలువడనున్నాయి.