మొదలైన రంజాన్ వేడుకలు... నగరానికి కొత్త కళ...

SMTV Desk 2017-05-27 12:37:40  Ramadan, hyderabad, fastings

హైదరాబాద్, మే 25: ఉపవాసదీక్షలతో సర్వమానవ శ్రేయస్సును చాటిచేప్పే రంజాన్ మాసంతో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక శోభ సమకూరనుంది. రంజాన్ ఉపవాసదీక్షలను ఆదివారం నుండి నిర్వహించాలని మతపెద్దలు నిర్ణయించారు. శుక్రవారం నెలవంక దర్శనం ఇవ్వకపోవడంతో శనివారం నుండి ప్రారంభించాల్సిన రంజాన్ ఉపవాసదీక్షలు ఆదివారంకు వాయిదా పడ్డాయి. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్దలతో ఉపవాస దీక్షలు నిర్వహిస్తూ... నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. తెల్లవారుజాను 5 గంటల 40 నిమిషాల ప్రాంతంలో సహార్, సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో ఇఫ్తార్ ద్వారా ఆహార పానియాలు స్వీకరించే ముస్లిం సోదురులు మిగతా సమయం అంతా పచ్చి మంచినీరు సైతం సేవించకుండా కఠిన ఉపవాసం నిర్వహిస్తూ దైవనామ స్మరణలో కాలం గడుపుతారు. నెల రోజులపాటు ఉపవాసదీక్షలు నిర్వహించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఉపవాసదీక్షలు, జకాత్ అనేవి ఇస్లాం సంప్రాదాయంలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. జకాత్ అంటే తన సంపాదనలో కొంత సొమ్ము (పదవ వంతు లేదా ఇష్ట ప్రకారం)ను దానంగా నిస్సాహాయులకు, అవసరమైన వారికి అందించడం. ఇదే సూత్రం ఆధారంగా రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక శోభ సంతరించుకుంటుంది. ఎక్కడ చూసిన ఇప్తార్ విందులతో ఆలింగనాలు, పేదలకు సహాయ సహాకారాలు ఇత్యాధితో తోటి వారిలో దైవాన్ని చూస్తారు. మానవ సేవే మాధవ సేవ అనేది రంజాన్ సందర్భంగా పరిఢవిల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.