మరాఠాలను ఆదర్శంగా తీసుకున్న కాపు నేతలు

SMTV Desk 2017-08-11 12:58:16  Kapu Reservations, Mudragada padmanabham, Chalo amaravathi, mudragada paadayaatra

అమరావతి, ఆగస్ట్ 11: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ఛలో అమరావతి యాత్రను గత 15రోజుల నుండి అనుమతి లేని కారణంగా పోలీసులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో నేతలు తమ ఉద్యమ విధానం మార్చే ఆలోచనలో ఉన్నట్టు కాపు వర్గాల సమాచారం. ఇటీవల మహారాష్ట్రలోని మరాఠాలు ముంబైలో శాంతియుతంగా మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఇదే విధంగా వీరు కూడా అమరావతిలో శాంతియుతంగా మార్చ్ నిర్వహించి, బహిరంగసభను నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కాపు నేత ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరపాలని యోచిస్తున్నారు.