ఆసిఫాబాద్ మండల యూత్ జేఏసీ కార్యవర్గ ఎన్నికలు

SMTV Desk 2017-08-08 15:16:06  asifabad, Youth JAC Election, Komram bheem District

కొమరం భీం, ఆగష్ట్ 8: ఈ రోజు ఆసిఫాబాద్ పట్టణంలోని స్థానిక రోజ్ గార్డెన్ నందు ఆసిఫాబాద్ మండల యూత్ జేఏసీ కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులుగా వైరాగారే ప్రతాప్ కుమార్, మండల అధ్యక్షులు గా అనుమండ్ల సాయి క్రిష్ణ, ఉపాధ్యక్షులు గా ఎస్.యాదవ్, ఎం. వినోద్, పులి సతీష్, శ్యామల అమర్, ప్రధాన కార్యదర్శి గా చంద్రశేఖర్, సహాయ కార్యదర్శలు గా కే. నాం దేవ్, వినీత్, వై.రవి, పెద్దింటి రాకేశ్, ట్రేజరర్ గా సుశీల్ కుమార్, ప్రచార కార్యదర్శిగా చునార్కార్ రాజ్ కుమార్, అధికార ప్రజా ప్రతినిధులుగా షేక్ సమీర్, రాందాస్ గార్లను ఎన్నుకున్నారు. అనంతరం యువజన సంఘాల ప్రతినిధులు అందరు కలిసి యువత కు జరుగుతున్నా అన్యాయం నిరుద్యోగం మరియు యువత పై రాజకీయ ఒత్తిడి లు మానుకోవాలని, స్వయం ఉపాధి లోన్ లు అర్హులైన నిరుద్యోగ యువతకే కేటాయించాలని ఇంకా పలు విషయాలపై అంబెడ్కర్ విగ్రహానికి పూల దండ వేసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం, ఇటీవల జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన జావీద్ కుటుంబానికి యూత్ జేఏసీ తరుపున ఆర్ధిక సహాయం అందజేసారు.