రూ.50 వేలు తరలించినా ఆధారాలు తప్పనిసరి

SMTV Desk 2019-03-12 12:29:56  telangana, loksabha election, election commission, elcetion code

హైదరాబాద్‌, మార్చ్ 12: లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులోకొచ్చిన సనగతి తెలిసిందే. ఇందులో భాగంగా నగదు తరలింపుపై ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతారు. ఈ క్రమంలో రూ. 50 వేలకు మించి నగదు తరలించే సామాన్య ప్రజానీకం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం రూ. 50 వేలకు మించి డబ్బు తరలించిన సమయంలో.. అది అధికారులకు పట్టుబడితే తప్పనిసరిగా ఆధారాలు చూపాల్సిందే. లేని యెడల ఆ నగదును అధికారులు సీజ్‌ చేసి.. ఐటీ అధికారులకు అప్పగిస్తారు. ఒక్క నగదుకే ఆధారాలు తప్పనిసరి కాదు. ఒక వేళ కొదవ పెట్టిన బంగారాన్ని విడిపించినా దానికి సంబంధించిన పత్రాలను తప్పక చూపాలి. అలాగే ఆస్పత్రుల్లో వైద్య ఖర్చుల కోసం భారీ మొత్తంలో డబ్బును తీసుకెళ్తుంటారు. ఇలాంటి వారు సైతం రోగి అడ్మిట్‌ అయిన ఆస్పత్రి రశీదులు కూడా చూపించాలి.