రేవంత్ రెడ్డిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన హై కోర్టు

SMTV Desk 2019-03-11 13:17:38  revanth reddy, telangana high court, telangana assembly elections, vem narender reddy

హైదరాబాద్, మార్చ్ 11: తెలంగాణ హై కోర్టు రేవంత్ రెడ్డిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిర్భందంపై దాఖలైన పిటిషన్‌ను ఈ రోజు హై కోర్టు కొట్టివేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డిని అక్రమంగా నిర్భంధిచారంటూ ఆయన అరెస్టును సవాల్‌ చేస్తూ రేవంత్‌ సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. అయితే దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.