వైఫల్యాలను కూడా సానుకూల దృక్పథంతో స్వీకరిస్తే, విజయం తథ్యం : కెటిఆర్

SMTV Desk 2019-03-11 07:31:02  ktr, trs, ambedkar open university, key makers youth sammit 2019

హైదరాబాద్, మార్చ్ 10: ఆదివారం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కీ మేకర్స్ యూత్ సమ్మిట్-2019ను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రపంచంలోనే ఎక్కువ మంది యువత ఉన్న దేశం భారత్ అని, యువ శక్తిని ఉపయోగించుకుంటే ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఆయన పేర్కొన్నారు. యువ శక్తిని ఉపయోగించుకుంటే నిత్యం ఎదుర్కొనే సమస్యల నుంచి నూతన ఆవిష్కరణలు చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టి-హబ్ ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వైఫల్యాలను కూడా సానుకూల దృక్పథంతో స్వీకరిస్తే, విజయం తథ్యమని ఆయన తేల్చి చెప్పారు. టెక్నాలజీ సామాన్యులకు కూడా ఉపయోగపడాలని అన్నారు.