ప్రారంభమైన మంచువారి ‘గాయత్రి’

SMTV Desk 2017-08-06 16:08:06  GAYATHRI, MOHAN BABU, MANCHU VISHNU, MANOJ, MADAN, THAMAN , ALI, ANASUYA, GEETHA SINGH

హైదరాబాద్, ఆగస్ట్ 6: ఇప్పటికే 500లకు పైగా చిత్రాల్లో నటించిన మోహన్ బాబు ఇప్పటికీ మినిమం గ్యాప్ లో సినిమాలు చేస్తూనే ఉన్నారు. తమ సొంత నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘గాయత్రి’. గత శుక్రవారం హైదరాబాద్‌లో మంచు కుటుంబ సభ్యుల మధ్య ఈ సినిమా గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో భాగంగా మండల కేంద్రమైన చంద్రగిరి రెవెన్యూ కార్యాలయ ఆవరణలో శనివారం మధ్యాహ్నం హాస్య సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్బంగా దర్శకుడు నటీనటులకు సన్నివేశాలు వివరించారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ నెల 24 వరకు చంద్రగిరి, తిరుపతి పరిసర గ్రామాల్లో హీరో మోహన్‌బాబుతో పాటు ఆలీ, గీతాసింగ్‌, అనసూయ, రఘుబాబులతో చిత్రీకరణ కొనసాగుతుంది అని తెలిపారు. ఇందులో మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా కన్పించనున్నారట అంటే టోటల్ గా ఇది మంచువారి సినిమా. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.