బయోపిక్ ఆఫ్ సంజయ్ రిలీజ్ డేట్ ఫిక్స్

SMTV Desk 2017-08-06 11:53:00  bio pic of sanjaydhatt movie release date

ముంబై, ఆగస్ట్ 6 : సంజయ్ దత్ జీవితచరిత్రను ఆధారంగా తీసుకొని రాజ్ కుమార్ హిరాణీ ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సంజయ్ పాత్రలో రణబీర్‌ కపూర్, అతని తండ్రి పాత్రలో పరేష్ రావల్ నటించనున్నారు. షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమాను సహజత్వానికి చాలా దగ్గరగా, నిజ జీవిత కథకు చేరువలో ఉండేలా రాజ్ కుమార్ ఈ స్క్రిప్టును తయారు చేసుకున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సినిమాను మార్చి 2018న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో సంజయ్, మాధురీ దీక్షిత్ ను ప్రేమించిన విషయం కూడా ప్రస్తావించనున్నట్లు తెలుస్తుంది.