దొంగతనం బయట పడుతుందనే కదా మీ భయం: కేటీఆర్

SMTV Desk 2019-03-06 10:59:18  KTR, Chandrababu, IT Grid, Fraud, Twitter

హైదరాబాద్, మార్చి 6: గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఐటీ గ్రిడ్‌ సంస్థ డేటా చోరిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ రాష్ట్రం పై మండిపడ్డ సంగతి తెలిసిందే. ఈ డేటా లీక్ విషయం పట్ల చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. చంద్రబాబు నాయుడు ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. "మీరు ఏ నేరం చెయకపోతే ఈ ఉలిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపీ పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్ట్ లో తప్పుడు పిటిషన్ లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయట పడుతుందనే కదా మీ భయం చంద్రబాబు గారు?" అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
twitter1