అభినందన్ విషయం పై ప్రధాని నోరు మెదపక పోవడం దారుణం : అఖిలేష్

SMTV Desk 2019-02-28 15:36:52  Akhilesh yadav, Abhinandan misising, India leadership, Prime Minister of India, Pakistan, Terrorists, IAF braves

లక్నో,ఫిబ్రవరి 28: మన వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్ ని పాకిస్థాన్‌ సైన్యం అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెడుతుండడంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం నోరు మెదపడం లేదని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌ విమర్శించారు. మన పైలెట్‌ను పాక్‌ అదుపులోకి తీసుకుని అప్పుడే ఒక రోజు గడిచిపోయిందని, అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని దేశం కోరుకుంటోందని అన్నారు. కానీ దేశాన్ని నడిపిస్తున్న మన నాయకుడు మాత్రం అభినందన్‌ విషయం ఏం చేస్తున్నారు, పాకిస్థాన్‌తో ఎలా వ్యవహరిస్తున్నారన్న విషయంలో మౌనంగానే ఉన్నారంటూ ట్వీట్‌ చేశారు.