భాషా పండిట్, వ్యాయమ ఉపాద్యాయులకు పదోన్నతులు

SMTV Desk 2019-02-07 12:03:50  Chandrasekhar Rao, Sarottham Reddy, Kamalakar Rao, Someshwar Rao, Abdullah, Telugu Teachers, PET, PD, Promotions

హైదరాబాద్, ఫిబ్రవరి 07: తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో భాషా పండిట్, వ్యాయమ ఉపాద్యాయులు(పీఈటీ) లకు పదోన్నతులకు సంబందించిన ఫైలుపై బుధవారం ఉదయం సంతకం చేశారు. ఈ పదోన్నతులను తక్షణమే అమలు చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ పదోన్నతుల కింద రాష్ట్రంలో 8,800 బాషా పండిట్లు, 2,000 మంది వ్యాయామ ఉపాద్యాయులు లబ్దిపొందనున్నారు. బాషా పండిట్లను స్కూల్ అసిస్టెంట్లుగా, పీఈటీలను ఫిజికల్ డైరెక్టర్లుగా పదోన్నతులు పొందుతారు. ప్రపంచతెలుగు మహాసభలలో బాషా పండిట్లకు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం పదోన్నతులు కల్పిస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ పదోన్నతులు కల్పించినందుకు ఉపాద్యాయ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. పి.ఆర్.టి.యు.టి.ఎస్. రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తమ్ రెడ్డి, కార్యదర్శి కమలాకర్ రావు, వ్యాయామ ఉపాద్యాయ సంఘం అధ్యక్షుడు సోమేశ్వర రావు, పండిత పరిషత్ అధ్యక్షుడు అబ్దుల్లా తదితరులు సిఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.