మంత్రి వర్గ విస్తరణపై స్పష్టత

SMTV Desk 2019-02-03 10:51:07  Chandrasekhar Rao, Cabinet Expansion

హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు నెలలు అయిన ఇంకా మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలే తప్పించి స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి పట్టింపులు ఎక్కువ. మంత్రి వర్గ విస్తరణాన్ని మాఘ మాసంలో ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ లేదా 8వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 10వ తేదీ లోపే కేబినెట్ విస్తరణ ఉంటుందని, 7, 8 తేదీల్లో ముహూర్త బలం బాగుండటంతో ఆ రెండు రోజుల్లో ఏదో వొకరోజు మంత్రివర్గ విస్తరణ ఖాయం అని అంటున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్ కచ్చితమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.