కేబుల్ చార్జీల నిభందనలు

SMTV Desk 2019-02-02 18:29:26  Telecom Regulatory Authority of India, Cable Charges

హైదరాబాద్, ఫిబ్రవరి 2: టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) కేబుల్ చార్జీలపై నిభందనలు విధించింది. ఈ నిభంధనల ప్రకారం కేబుల్‌ ఆపరేటర్లు చార్జీలను స్వల్పంగా సవరించి తుది నిర్ణయం ప్రకటించారు. ఈ నిభంధనల ప్రకారం తెలుగు చానళ్ల ధరలు ఇలా ఉన్నాయి...

జెమిని- 7 చానెళ్ళకి రూ. ౩౦, ఈటీవీ ఫ్యామిలీ ప్యాక్- 7 చానెళ్ళకి రూ. 24, స్టార్ మా ప్యాక్- 7 తెలుగు, 3 ఇతర భాష చానెళ్ళకి రూ. 39, జీ చానల్స్- 2 తెలుగు, 7 ఇతర భాష చానెళ్ళకి రూ. 20, మొత్తం రూ.113+రూ.20, 34 జీఎస్టీ ఉంటుంది. తెలుగు, ఆంగ్ల న్యూస్‌ ఛానల్స్‌, డీడీ ఇతర చానెల్స్ ఉచితంగా లభిస్తాయి. ఇవన్నీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన ప్రీమియం ప్యాకేజీ రూ.130లో లభిస్తాయి. దీనికి 18శాతం జీఎస్టీ ఉంటుంది. రూ.130 బేసిక్‌ ప్యాకేజీ ట్యాక్స్‌తో కలిపి రూ.155 అవుతుంది. అలాకార్ట్‌ విధానంలో మాటీవీ హెచ్‌డి వొక్కటే 19 రూపాయలు. సాధారణమైతే ఎస్‌డి 10 చానల్స్‌ బొకే రూ.39 ధరకు లభిస్తాయి. మొత్తం మీద పేఛానల్స్‌, ప్రీమియం ఛానల్స్‌ కలిపి రూ.285, 300 వరకు నెలవారీ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది.