హైదరాబాద్ లో కొత్త టెక్నాలజీ

SMTV Desk 2019-01-31 17:33:03  Hyderabad, Traffic Rules, New Technology, Drones

హైదరాబాద్, జనవరి 31: హైదరాబాద్ నగరంలో సరికొత టెక్నాలజీ అందుబాటు లోకి రానుంది. హైదరబాద్ పోలీస్ శాఖ నేరాలను అదుపు చేయడానికి డ్రోన్ లను ఉపయోగించనుంది. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ దాటితే డ్రోన్లు వాహనాన్ని వెంటాడి పోలీసులకు పట్టిస్తాయి. ఈ టెక్నాలజీని మొదటిసారి హైదరాబాద్ లో వాడనున్నారు. అంతేకాకుండా ఎలాంటి నేరాలు జరగకుండా చూసే క్రమంలో నేరగాళ్లపై నిఘా ఉంచడం, ఇంటి పన్నుల లెక్కింపు, ఏరియల్ సర్వేలాంటి పనులకు కూడా వీటిని వాడనున్నారు. డ్రోన్లు వాడటం వలన అధికారులకు సమయం కూడా ఆదా అవుతుంది.

అన్ని పనులను సమర్తవంతంగా నిర్వహించేలా ఈ డ్రోన్ లను ఆధునిక టెక్నాలజీ తో రూపొందించనున్నారు. ఈ బాధ్యతలను ప్రముఖ సాంకేతిక సంస్థ సైంట్ కు అప్పగించారు. మల్టిపుల్ డ్రోన్ల లాంచ్ ద్వారా నగరంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు, పలు ప్రాంతాలపై డ్రోన్స్ తో నిఘా ఉంచాలని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహణకు కూడా గ్రేహౌండ్స్ బలగాలు డ్రోన్ లను వాడాలని భావిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్ లను తెలంగాణ ఎన్నికలలో, నేతల బహిరంగ సభల్లో నిఘా ఉంచడానికి వాడారు. ఈ డ్రోన్‌లకు అమర్చే థర్మల్ కెమెరాలు అగంతుకుల కదలికలను పసిగట్టి పోలీసులను అప్రమత్తం చేస్తాయి. డ్రోన్ డిప్లాయిమెంట్ వెహికల్ ద్వారా ఈ డ్రోన్లను కంట్రోల్ చేస్తారు.