ఢిల్లీ వెళ్లనున్నతెలంగాణ సీఎం...

SMTV Desk 2019-01-21 17:37:23  Telangana state chief minister KCR, KCR Going Delhi, TRS, Central minister son mayank, Mayank marriage

హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి పయనం అవనున్నారు. కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ కుమారుడు మయాంక్ వివాహం సందర్భంగా వేడుకల్లో పాల్గొనేందుకు కేసీఆర్ వెళ్లనున్నారు అని సమాచారం.

వేడుకలో పాల్గొన్న అనంతరం తిరిగి అదే రోజు హైదరాబాద్ కు రానున్నారు అని పార్టీ వర్గం చెప్తుంది. మరోవైపు ఇప్పటికే బీజేపీ తో స్నేహపూర్వక బంధాలు ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్న కేసీఆర్ అదే క్రమంలో మోడీని కూడా కలుస్తారు అని పలు పార్టీ వర్గాలు అంటున్నారు.