గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టిన సీఎల్పీ నేత

SMTV Desk 2019-01-19 15:23:15  Telangana state governor narashimhan, Bhatti vikramarka, CLP Leader, Telangana legislative assembly, KCR

హైదరాబాద్, జనవరి 19: గవర్నర్ నరసింహన్ అసెంబ్లీ సమావేశంలో ఇచ్చిన ప్రసంగాన్ని నూతన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో కొత్తదనం లేదని, నిరుద్యోగుల గురించి వాస్తవాలు చెబితే నమ్మేవాళ్ళ మని అన్నారు. అంతేకాక సభను హుందాగా నడుపుతారని ఆశిస్తున్నామన్నారు. టీఆర్ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తమ ఎమ్మెల్యేలు లొంగరని, తమ ఎమ్మెల్యేలపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భట్టి ద్వజమెత్తారు.

సీఎం కేసీఆర్‌ స్పీచ్‌నే గవర్నర్‌ కాపీ కొట్టారని, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, రిటైర్మెంట్‌పై స్పష్టతలేదని షబ్బీర్‌అలీ విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగంలో ముస్లిం రిజర్వేషన్లపై మైనార్టీగా ప్రస్తావించారని, దీనిపై స్ష్టత ఇవ్వాలని షబ్బీర్‌ డిమాండ్ చేశారు.