టీఆరెస్ కండువా కప్పుకున్న ఒంటేరు

SMTV Desk 2019-01-18 17:43:00  Onteru prathap reddy, TRS, Congress party, TDP, KCR, KTR

హైదరాబాద్, జనవరి 18: కేసీఆర్ వ్యతిరేఖ పోటీ దారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వొంటేరు ప్రతాప్ రెడ్డి కొద్ది సమయం క్రితం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. తన అనుచరులతో కలిసి ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్‌కు ఓట్లు వేశారని ఆయన చెప్పారు.

తాను కొండ పోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా నిర్వాసితుల తరపున పోరాటం చేసినా కూడ ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్‌కే ఓట్లు వేశారని చెప్పారు. 2009, 2014, 2018 ఎన్నికల సమయంలో తనను టీఆర్ఎస్ లో చేరాలని కోరినా కూడ చేరలేదన్నారు. గతంలోనే టీఆర్ఎస్‌లో చేరితే తాను లబ్ది పొందేవాడినని చెప్పారు. గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలనే ఉద్దేశ్యంతోనే తాను పోరాటం చేసినట్టు వొంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పారు.