ప్రైవేటు హాస్టల్స్ కి జిహెచ్‌ఎంసి జరిమానా

SMTV Desk 2019-01-17 15:56:05  Hyderabad private hostels, GHMC, Madhapoor

హైదరాబాద్/మాదాపూర్, జనవరి 17: హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో పలు ప్రైవేటు హాస్టల్ లో జీహెచ్ఎంసీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్రత, సెల్లార్‌లలో వంటగది నిర్వహిస్తున్న నాలుగు హాస్టళ్లకు రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు.

ప్రమాణాలు పాటించకపోతే కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. చందానగర్‌ సర్కిల్‌లోని మియాపూర్‌ జంక్షన్‌లోని పటు హోటళ్లు, రెస్టారెంట్లపై ఇటీవలే మున్సిపల్‌ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.