అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

SMTV Desk 2019-01-17 14:43:48  Telangana assembly, New MLA s, KCR, Postponed asembly meetings

హైదరాబాద్, జనవరి 17: నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మిగితా సభ్యులు చేశారు.

ఈ కార్యక్రమం దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగింది. ఈ సభలో ఈ రోజు 114 మంది శాసనసభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. కాగా ఈ సమావేశాలు రేపటికి వాయిదా పడింది.